కరోనా రెండోదశ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు సాధారణ షెడ్యూల్ ప్రకారం జులైలో ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్ కుదించినట్లు పేర్కొన్న కేంద్ర మంత్రి.. గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.
గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి యథావిధిగా జరుగుతాయన జోషి పేర్కొన్నారు. మరోవైపు ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.