తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ గాంధీకి 'మోదీ ఫోబియా': అమిత్ షా

Amit Shah on Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీ అంటే రాహుల్​ గాంధీకి భయం అన్నారు కేంద్ర మంత్రి అమిత్​ షా. బంగారు గోవా కావాలో లేక గాంధీ కుటుంబానికి చెందిన గోవా కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. గోవాలో భాజపా మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదన్నారు.

Goa Election 2022
అమిత్​ షా

By

Published : Jan 30, 2022, 5:53 PM IST

Goa Election 2022: కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మోదీ ఫోబియాతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. రాహుల్​కు ప్రధాని నరేంద్ర మోదీ అంటే భయమని పేర్కొన్నారు. స్థిరత్వం ఉంటేనే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. గోవా ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆదివారం పర్యటించిన షా.. ఈ వ్యాఖ్యలు చేశారు.

మీరే నిర్ణయించుకోండి..

భాజపా తెచ్చే 'బంగారు గోవా' కావాలో లేక రాష్ట్రం 'గాంధీ కుటుంబానికి చెందిన గోవా'గా మారాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు షా. ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా గోవా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని.. కానీ అవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని ఆప్, టీఎంసీని ఉద్దేశించి విమర్శించారు. అది కేవలం భాజపాకే సాధ్యం అని అన్నారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధికే మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు.

గోవా పర్యటనలో అమిత్​ షా

గోవా పర్యటనలో భాగంగా షా మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. పోండా, సన్వోర్దెమ్​, వాస్కో నియోజకవర్గాల్లో ఈ సమావేశలను భాజపా నిర్వహించింది. సన్వోర్దెమ్​లో ఇంటింటి ప్రచారంలో షా పాల్గొన్నారు.

సన్వోర్దెమ్​ నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న షా

గోవాలోని మొత్తం 40 నియోజకవర్గాల్లో భాజపా తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

ఇదీ చూడండి :యోగి కోసం రంగంలోకి 'మానసపుత్రిక'.. అప్పుడు భాజపాకు ఝలక్.. ఇప్పుడు..

ABOUT THE AUTHOR

...view details