తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గగన్​యాన్​'లో కీలక ముందడుగు.. ఆ పరీక్షలు విజయవంతం

Gaganyaan program: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టనున్న గగన్​యాన్​ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రయోగంలో ఉపయోగించే క్రయోజనిక్​ ఇంజిన్​ను విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో తెలిపింది. 720 సెకన్ల పాటు జరిగిన ఈ టెస్టింగ్​లో అంచనాలను అందుకున్నట్లు పేర్కొంది.

Gaganyaan program
గగన్​యాన్​

By

Published : Jan 13, 2022, 12:22 PM IST

Gaganyaan program: గగన్​యాన్​ ప్రయోగంలో కీలక ముందడుగు పడింది. ఇందుకోసం ఉపయోగించే క్రయోజనిక్​ ఇంజిన్​ను బుధవారం విజయవంతంగా పరీక్షించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. తమిళనాడు, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్సన్​ కాంప్లెక్స్​లో 720 సెకన్ల పాటు పరీక్షించినట్లు తెలిపింది. ఇందులో ఇంజిన్​ పనితీరు లక్ష్యాలను చేరుకుందని, ముందుగా నిర్ణయించుకున్న అంచనాలను అందుకున్నట్లు పేర్కొంది.

క్రయోజనిక్​ ఇంజిన్

"ఈ దీర్ఘకాల పరీక్ష విజయవంతం కావటం గగన్​యాన్​ ప్రాజెక్టులో కీలక మైలురాయి. ఈ టెస్ట్​.. గగన్​యాన్​ లాంచ్​ వెహికిల్​లో ఉపయోగించే క్రయోజనిక్​ ఇంజిన్​ విశ్వసనీయతను, పటిష్ఠతను నిర్ధరిస్తుంది."

- ఇస్రో.

ఈ క్రయోజనిక్​ ఇంజిన్​ సుమారు 1810 సెకన్ల పాటు జరిగే మరో నాలుగు పరీక్షలను ఎదుర్కోనుందని తెలిపింది ఇస్రో. దీంతో పాటు మరో ఇంజిన్​ రెండు స్వల్ప కాలిక పరీక్షలను, ఒక దీర్ఘకాలిక పరీక్షను ఎదుర్కొంటుందని, ఈ టెస్టులతో గగన్​యాన్​ కార్యక్రమంలోని ఇంజిన్ల అర్హత తెలుసుకునే ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది.

గగన్​యాన్​ ప్రాజెక్టు డిజైన్​ ప్రక్రియ పూర్తయిందని, పరీక్షల దశలోకి ప్రవేశించామని కొద్ది రోజుల క్రితమే ఇస్రో ఛైర్మన్​ కే శివన్​ వెల్లడించారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం 2022, ఆగస్టు 15లోపే మానవ రహిత గగన్​యాన్​ ప్రయోగం చేపడతామన్నారు. గడువులోపే చేపట్టేందుకు అంతా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఆ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details