ఉత్తర్ప్రదేశ్ అంబేడ్కర్ నగర జిల్లాలో కల్తీ మద్యం తాగి.. ఐదుగురు మరణించారు. మరో నలుగురు అస్వసస్థతకు గురయ్యారు. జైత్పుర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులంతా మఖ్దూంపుర్, శివపాల్ గ్రామాలకు చెందినవారుగా అధికారులు తెలిపారు.
"అజమ్గఢ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో తయారైన కల్తీ మద్యాన్ని శివపాల్ గ్రామానికి చెందిన సోను కొనుగోలు చేశాడు. దీనిని అతని కుటుంబానికి చెందిన 12 మంది సేవించారు. దీంతో అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు చనిపోగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది" అని అధికారులు తెలిపారు. కల్తీ మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.