తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్లో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగు

Fire Broke Out in Train: గాంధీధామ్- పూరీ ఎక్స్​ప్రెస్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నందుర్బార్ రైల్వే స్టేషన్​కి రాగానే బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Fire Broke Out In Gandhidham Express
రైలులో మంటలు

By

Published : Jan 29, 2022, 12:09 PM IST

Updated : Jan 29, 2022, 1:31 PM IST

రైల్లో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగు

Fire Broke Out in Train: మహారాష్ట్ర నందుర్బార్​ జిల్లాలో.. ఓ రైలులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా రైల్వే స్టేషన్​కు రాగానే గాంధీధామ్- పూరీ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. ఉదయం 10.45 నిమిషాలకు రైలు బోగీల్లో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు.

రైలులో దట్టంగా కమ్ముకున్న పొగలు

రైలులో ఆహారం తయారు చేసే(pantry car) బోగీలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. రైలు మిగిలిన బోగీలను మంటలు అంటుకున్న బోగీ నుంచి వేరుచేసినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

మంటలను ఆర్పుతున్న సిబ్బంది
Last Updated : Jan 29, 2022, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details