తెలంగాణ

telangana

5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​పై నేడు ఈసీ భేటీ

By

Published : Feb 24, 2021, 5:21 AM IST

త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగనుంది. ఈ ఎన్నికల షెడ్యూల్​ను ఖరారు చేసేందుకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. ఏప్రిల్​లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Election Commission
5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​పై నేడు ఈసీ భేటీ

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బంగాల్‌, అసోంలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ నిర్ణయించేందుకు నేడు భేటీ కానుంది. త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి మే, జూన్‌లోని వేర్వేరు తేదీల్లో అసెంబ్లీ గడువు పూర్తికానుండటం వల్ల ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

సీఈసీ సునీల్‌ అరోడా, ఎన్నిక కమిషనర్లు సుశీల్‌ చంద్ర, రాజీవ్‌ కుమార్‌ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో తమిళనాడు, 12న పుదుచ్చేరి, 13, 14 తేదీల్లో కేరళలో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details