చెన్నైలోని మధురవోయల్ ప్రాంతంలో ఉన్న అమ్మా క్యాంటీన్‌ను పలువురు డీఎంకే కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ఈ క్యాంటీన్‌పై దాడులు చేయడం వివాదానికి దారితీసింది. క్యాంటీన్ పరిసరాల్లోని పోస్టర్లను, బోర్డులను ఓ కార్యకర్త ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై స్పందించిన డీఎంకే చీఫ్ స్టాలిన్.. ఘటనకు కారకులైన వారిని పార్టీ నుంచి తొలగించారు.
అమ్మా క్యాంటీన్‌పై డీఎంకే కార్యకర్తల దాడి
చెన్నైలోని అమ్మా క్యాంటీన్‌పై పలువురు డీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన పార్టీ చీఫ్ స్టాలిన్.. అందుకు కారకులైన వారిని పార్టీ నుంచి తొలగించారు. ఘటనపై నొలంబూర్ పోలీస్ స్టేషన్లో డీఎంకే ఫిర్యాదు చేసింది.
అమ్మా క్యాంటీన్‌పై డీఎంకే కార్యకర్తల దాడి
స్థానిక ఎమ్మెల్యే ఎంఏ సుబ్రమణియన్ ఘటనాస్థలానికి చేరుకుని ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులను చక్కదిద్దే చర్యలు చేపట్టారు. పార్టీ అధినేత స్టాలిన్ ఇద్దరు కార్యకర్తలపై వేటు వేశారని వెల్లడించారు. ఘటనపై డీఎంకే నొలంబూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి :బంగాల్ ముఖ్యమంత్రిగా దీదీ ప్రమాణస్వీకారం