వృథాగా ఉన్న రైలు బోగీలో ఆఫీస్ Dilapidated Rail Office In Chhattisgarh: కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. చుట్టూ ఉన్నవేవీ వ్యర్థం కాదని నిరూపించారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రైల్వే అధికారులు. బిలాస్‌పుర్ రైల్వే జంక్షన్లో ఏళ్లనుంచి వినియోగించకుండా పడి ఉన్న రైల్వే కోచ్‌ను ప్రభుత్వ కార్యాలయంగా మలిచారు. ఇప్పుడు ఈ బోగీలో నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు రైల్వే అధికారులు.
ఆఫీస్ ఏర్పాటు చేసింది ఈ బోగీలోనే రైలు బోగీలోని ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తూ.. బోగీలోనే అన్ని వసతులు..
బోగీని ఇలా తయారు చేయడానికి కొచిన్ నుంచి కొంతమంది ఇంజినీర్లను ప్రత్యేకంగా రప్పించింది రైల్వే బృందం. బోగీలోని స్లీపర్ సీట్లను తొలగించారు. వాటి స్థానంలో టేబుళ్లు, కుర్చీలు, కప్‌బోర్డులను ఉంచారు.
రైలు బోగీలోనే అన్ని వసతులు రెండు కంపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్‌లో ఆరుగురు కూర్చునే విధంగా సీటింగ్ రూపొందించారు. లైట్, ఫ్యాన్‌తోపాటు టాయిలెట్, వాష్ బేసిన్లను కూడా అమర్చారు.
"రైల్వే ఉద్యోగులకు కొత్త భవనాలు నిర్మించాల్సి ఉంది. అవి ఇంకా పూర్తికాలేదు. వృథాగా ఉన్న రైల్వే కోచ్‌లో ఆఫీస్‌ను ఏర్పాటు చేయాలని భావించాం. నూతన భవనం పూర్తయ్యాక కార్యాలయాన్ని అక్కడికి మారుస్తాం."
-- సాకేత్ రంజన్, ఆగ్నేయ రైల్వే సీపీఆర్ఓ
అంతేకాక మహిళా ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశారు. గాలి, వెలుతురు కోసం బోగీ కిటికీలను అలాగే ఉంచారు. ఇప్పుడు ఈ బోగీ నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు రైల్వే ఉద్యోగులు.
ఇలా వృథాగా ఉన్న ఏసీ, స్లీపర్ బోగీలను ఉపయోగించుకోవడం ద్వారా.. కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించే ఖర్చు తగ్గుతుందని ఆగ్నేయ రైల్వే సీపీఆర్ఓ సాకేత్ రంజన్ తెలిపారు.
ఇదీ చూడండి:కేంద్రం కొత్త రూల్స్- బైక్‌పై పిల్లలతో వెళ్తే ఇవి తప్పనిసరి!