రాగల 6 గంటల్లో తౌక్టే తుపానుగా తీవ్రరూపం దాల్చనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 12గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈనెల 16 నుంచి తౌక్టే తుఫాను తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపింది. 18న గుజరాత్లోని పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించింది.
భద్రతా, సహాయ చర్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో సమావేశం కాకున్నారు. తుఫానును దృష్టిలో పెట్టుకుని జాతీయ విపత్తు దళాన్ని 53మంది నుంచి 100కు పెంచారు.