దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడం వల్ల దిల్లీలో వరుసగా మూడో రోజు గాలి నాణ్యత క్షీణించింది. దిల్లీలో వాయునాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది.
మొత్తంగా దేశరాజధానిలో గాలినాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. దిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్.. 466 పాయింట్లతో అత్యంత కాలుషితమైన ప్రాంతంగా నమోదైంది. ఐఐటీ దిల్లీ ప్రాంతంలో(441), లోధి రోడ్డు(432), పూసా రోడ్డు(427) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.