బాలికపై ఓ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన దిల్లీలో వెలుగుచూసింది. 'కోట్ల ముబారక్పుర్ ప్రాంతంలో నివసించే ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లుగా సమాచారం అందింది. అమెకు సోదరుడి వరసయ్యే యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది' అని పోలీసులు వివరించారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సోదరుడు - దిల్లీ అత్యాచారం కేసులు
ఓ బాలికపై సమీప బంధువు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితుడు బాధితురాలికి సోదరుడని పోలీసులు తెలిపారు.
అత్యాచారం
ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 376, 506తో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: