తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సినిమా స్టైల్​లో ఛేజింగ్.. 22కి.మీ టైర్​ లేకుండానే ప్రయాణం - హరియాణాలోని గురుగ్రామ్

cow smugglers in Gurugram: గోవులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు గోరక్షకులు. ఈ ఛేజింగ్.. సినిమా సీన్ తరహాలో జరిగింది. టైరు ఊడిపోయిన వాహనంతో స్మగ్లర్లు 22 కిలోమీటర్లు ప్రయాణించారు.

cow smugglers in Gurugram
గోవులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

By

Published : Apr 10, 2022, 1:00 PM IST

గోవులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

cow smugglers in Gurugram: గోవులను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు గోరక్షకులు. ఈ ఘటన శనివారం ఉదయం హరియాణాలోని గురుగ్రామ్​లో జరిగింది. అయితే ఇది అంత సులువుగా జరగలేదు. స్మగ్లర్లకు, గోరక్షకులకు మధ్య పెద్ద ఛేజింగ్ సీన్​ జరిగింది. స్మగ్లర్లు ప్రయాణిస్తున్న వాహనంపై గోరక్షకులు కాల్పులు జరిపారు. దీంతో వారి వాహనం టైరు ఊడిపోయింది. అయినా నిందితులు ఆగకుండా 22 కిలోమీటర్లు మేర టైరు లేని వాహనంతోనే ప్రయాణించారు. ఆ సమయంలో స్మగ్లర్ల వాహనం నుంచి ఒక గోవు కింద పడిపోయింది.

నిందితులను గామ్​డొజ్​ టోల్​ప్లాజా వద్ద గోరక్షకులు పట్టుకున్నారు. ఏడుగురిలో ఇద్దరు తప్పించుకోగా మిగతా ఐదుగురిని పోలీసులకు అప్పగించారు. హరియాణా ప్రభుత్వం.. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు కఠిన చట్టాలను తెచ్చింది.

ఇదీ చదవండి:రోగి చనిపోయాడని వైద్యుల నిర్ధరణ.. స్నానం చేయిస్తుండగా షాక్!

ABOUT THE AUTHOR

...view details