తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా థర్డ్​ వేవ్​కు ఈ లెక్కలే సంకేతమా?

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా వైరస్​ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొవిడ్​ రెండు దశలను భారత్​ సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ.. థర్డ్​ వేవ్​పై(Third wave of Corona) భయాలు పట్టుకున్నాయి. కారణం.. వైరస్​ను వేగంగా వ్యాపింపజేసే డెల్టా వేరియంట్. కొద్ది నెలలుగా నమోదవుతున్న కేసుల్లో డెల్టా సంఖ్య ఎక్కువ. అయితే.. కేరళ, మహారాష్ట్రలో కేసుల పెరుగుదల థర్డ్​ వేవ్​కు సంకేతాలేనా? ప్రజారోగ్య నిపుణులు ఏమంటున్నారు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

CORONA third wave
కరోనా మూడో దశ, కరోనా థర్డ్​ వేవ్​

By

Published : Aug 13, 2021, 4:16 PM IST

దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా కరోనా కేసులు (Corona cases in India) స్థిరంగా నమోదవుతున్నా.. మహారాష్ట్ర, కేరళలో(Kerala covid cases) మాత్రం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇప్పుడివే.. కొవిడ్​ మూడో దశకు(థర్డ్​ వేవ్​)(Third wave of Corona) సంకేతాలు కావొచ్చని అభిప్రాయపడుతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. సంబంధిత అంశమై ఈటీవీ భారత్​కు పలు విషయాలు వెల్లడించారు.

కేరళలో కొవిడ్​ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుంటే.. ఇటీవల మహారాష్ట్రలోనూ రోజువారీ కేసులు మళ్లీ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఈ కేసుల పెరుగుదలకు కారణం డెల్టా వేరియంటే కావడం. కొవిడ్​ వ్యాప్తి విజృంభణకు ప్రధాన కారణం డెల్టానేనని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.

కరోనా పరీక్షల కోసం జనం

''ఈ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలతో కరోనా మూడో దశకు అవకాశాలున్నాయి. థర్డ్​ వేవ్​కు.. కేరళ, మహారాష్ట్ర నుంచే మొదలవ్వొచ్చు. కఠిన లాక్​డౌన్​ విధించి.. ఈ కొవిడ్​ సంక్రమణకు అడ్డుకట్ట వేయొచ్చు.''

- డా. సునీలా గార్గ్​, ప్రజారోగ్య నిపుణులు

ప్రస్తుతం భారత్​లో ఉన్న కరోనా క్రియాశీల కేసుల్లో(Active Corona Cases) 50 శాతం కేరళ నుంచే ఉన్నాయి. పలు నివేదికలను ఉటంకిస్తూ.. హోం ఐసోలేషన్ ప్రోటోకాల్​ను కేరళ సక్రమంగా పాటించట్లేదని అన్నారు గార్గ్​.

కరోనా నిబంధనలు మరిచి గుంపులుగుంపులుగా జనం

ఇంకా ఏమన్నారంటే..

  • మార్చి 10 - ఆగస్టు 10 మధ్య.. ​ అంటే 5 నెలల్లో కేరళలో కరోనా కేసుల సంఖ్య 233 శాతం పెరిగింది.
  • కేరళలో ఇంకా 56 శాతం మందికి కరోనా ముప్పు ఉంది.
  • రాష్ట్రంలో దాదాపు 95 శాతం మంది స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు.
  • రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ రేటు కూడా అంతంతమాత్రంగానే ఉంది.

''కేరళలో 2.24 కోట్ల మంది ప్రజలు టీకా పొందారు. అయితే ఇందులో 64 లక్షల మంది మాత్రమే రెండో డోసు కూడా తీసుకున్నారు.''

- సునీలా గార్గ్​, ప్రజారోగ్య నిపుణులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కొవిడ్​ మార్గదర్శకాలను సరిగా పాటించడం లేదని ఆమె హెచ్చరించారు. ఓనమ్​ ముందు ఇదే జరిగిందని, కేరళీయుల్లో అలసత్వం కనిపించిందని గార్గ్​ పేర్కొన్నారు.

టీకా కోసం వచ్చిన ప్రజలు

ఇవీ చూడండి:'టీకా తీసుకున్న వారిలో ఆ ముప్పు అరుదే!'

టీకా పంపిణీలో ఆ దేశం అగ్రస్థానం.. ఎలా సాధ్యం?

గత రెండు రోజుల్లో కేరళ, దేశంలో నమోదైన కేసులను ఓ సారి చూస్తే..

  • ఆగస్టు 11న దేశంలో మొత్తం కొత్త కేసులు(Corona cases in India) 41195 నమోదైతే.. కేరళలోనే సగం కంటే ఎక్కువ 23500 ఉన్నాయి.
  • ఆగస్టు 12న భారత్​లో కేసులు 40,120గా ఉంటే.. ఒక్క కేరళలోనే 21 వేల మంది బాధితులున్నారు.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలోనూ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఆగస్టు 10న 5609, ఆగస్టు 11న 5560, 12న 6388 ఇలా పెరుగుకుంటూ పోతున్నాయి.

వారం రోజుల్లో దేశంలో నమోదైన మొత్తం కేసుల్లోనూ.. సగం కంటే ఎక్కువ కేరళ వాసులే ఉన్నారని చెబుతున్నారు ఏషియన్​ సొసైటీ ఫర్​ ఎమర్జెన్సీ మెడిసిన్​ ప్రెసిడెంట్​, వైద్య నిపుణులు డా. తమోరిష్​ కోలే.

''కొవిడ్​ నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం, సూపర్​ స్ప్రెడర్​ ఈవెంట్సే కేసుల విజృంభణకు ప్రధాన కారణం. కేరళలో ఆయుర్దాయం ఎక్కువగా ఉన్న కారణంగా.. వృద్ధుల సంఖ్య అధికం. వీరు కొవిడ్​ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాప్తికీ వీరే దోహదం అవుతున్నారు.''

- డా. కోలే

ట్రేస్(గుర్తించడం)​, టెస్ట్(పరీక్షలు చేయడం), ఐసోలేట్(నిర్బంధంలో ఉంచడం)​ వ్యూహంతోనే దీని బారినుంచి తప్పించుకోగలమని కోలే సూచిస్తున్నారు. అదే సమయంలో వ్యాక్సినేషన్​ వేగం(Vaccination Rate) పెంచడం మంచి పరిష్కారమని అభిప్రాయపడ్డారు.

వ్యాక్సినేషన్​ కోసం ప్రజలు

కొవిడ్​ థర్డ్​ వేవ్ (Third wave of Corona) ​అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి వచ్చే అవకాశం లేదని కోలే అన్నారు.

''కేరళలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. కరోనా మూడో దశ ప్రారంభమైనట్లే అనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్లోనూ దీనికి మరో 2-3 నెలలు పట్టొచ్చు. దానికి తగ్గట్లుగా అధికారులు సిద్ధంగా ఉండాలి.''

- డా. కోలే, ప్రజారోగ్య నిపుణులు

ఇవీ చూడండి: వ్యాక్సిన్ 'కాక్​టైల్'​కు గ్రీన్​సిగ్నల్.. ఫలితం ఉంటుందా?

Delta Plus: రెండు డోసులు తీసుకున్నా.. 'డెల్టా ప్లస్'​కు బలి

ABOUT THE AUTHOR

...view details