కోర్టు ధిక్కరణపై(contempt of court) న్యాయస్థానాలకు ఉన్న అధికారాన్ని శాసన చట్టం ద్వారా కూడా తొలగించలేరని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు(Supreme court). కోర్టు అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. అపవాదుకు గురిచేయడం తప్పేనని, గతంలో రూ. 25 లక్షలు డిపాజిట్ చేయాలన్న ఆదేశాలను ధిక్కరించినందుకు ఓ ఎన్జీఓ ఛైర్పర్సన్ను దోషిగా తేల్చింది. ' కోర్టు ధిక్కరణకు(contempt of court section) పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. న్యాయస్థానాన్ని అవమానించేందుకు చేసిన అతని చర్యను సమర్థించలేం' అని పేర్కొంది.
రూ.25 లక్షలు డిపాజిట్ చేయాలన్న ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరుతూ సూరజ్ ఇండియా ట్రస్ట్ అనే ఎన్జీఓ ఛైర్పర్సన్ రాజీవ్ దయ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుంద్రేశ్ల ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, కోర్టుతో సహా అందరిపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
" ధిక్కరణ నేరానికి పాల్పడిన వారిని శిక్షించేందుకు ఈ కోర్టుకు రాజ్యాంగం ద్వారా అధికారం లభించింది. దానిని శాసన చట్టం ద్వారా కూడా తొలగించలేరు."
- సుప్రీం ధర్మాసనం.