తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా మాతా.. నువ్వే రక్షించాలమ్మా' - కరోనా దేవత గుడి యూపీ

కరోనా నుంచి రక్షించాలని వేడుకుంటూ ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామ ప్రజలు 'కరోనా మాత'కు పూజలు చేస్తున్నారు. వేపచెట్టు కింద దేవాలయాన్ని నిర్మించి అమ్మవారిని వేడుకుంటున్నారు.

corona mata temple
కరోనా మాత గుడి

By

Published : Jun 12, 2021, 1:36 PM IST

Updated : Jun 12, 2021, 1:44 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో 'కరోనా మాత' మందిరం

కరోనా బారి నుంచి తమను దైవమే కాపాడుతుందని నమ్ముతున్నారు ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్ జిల్లా​లోని ఓ గ్రామవాసులు. అందుకే.. వేపచెట్టు కింద 'కరోనా మాత' ఆలయాన్ని వారు నిర్మించుకున్నారు. వైరస్​ బారిన పడకుండా చూడాలని వేడుకుంటున్నారు. పూజలు చేస్తున్నారు.

'కరోనా మాత' మందిరం
వేపచెట్టు కింద 'కరోనా మాత' గుడి

"వైరస్​ నుంచి మమ్మల్ని ఆ దేవతే కాపాడుతుందని నమ్ముతున్నాం. అందుకే అందరం కలిసి కరోనా మాత గుడి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం," అని ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ తెలిపారు.

Last Updated : Jun 12, 2021, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details