దేశంలో 25వేల దిగువకు యాక్టివ్ కేసులు - corona vaccination
Covid Cases India: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 1,581 మంది వైరస్ బారినపడ్డారు. మరో 33మంది వైరస్ కారణంగా మరణించారు.
కరోనా న్యూస్
By
Published : Mar 22, 2022, 9:19 AM IST
|
Updated : Mar 23, 2022, 9:25 AM IST
Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 1,581 మందికి వైరస్ సోకింది. మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,741 మంది వైరస్ను జయించారు.
మొత్తం కేసులు: 4,30,10,971
మొత్తం మరణాలు: 5,16,543
యాక్టివ్ కేసులు: 23,913
కోలుకున్నవారు: 4,24,70,515
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. సోమవారం మరో 30,58,879 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,56,01,944కు పెరిగింది.
Covid Tests:
దేశంలో సోమవారం 5,68,471 కరోనా టెస్టులు నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనాసాగుతోంది. అయితే ఆదివారంతో పోల్చితే సోమవారం కేసుల సంఖ్య తగ్గింది. అన్ని దేశాల్లో కలిపి మరో 10,93,465 కొత్త కేసులు వెలుగుచూశాయి. 3,427 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 47,26,16,904కు చేరగా.. మృతుల సంఖ్య 61,05,565కు పెరిగింది.
కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో కాస్త తగ్గింది. అక్కడ 2,09,169కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 329 మరణాలు నమోదయ్యాయి.