తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona Cases In India: దేశంలో మరో 28 వేల మందికి కరోనా

భారత్​లో కరోనా కేసులు(Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 28,326 మంది​ కొవిడ్​​​ (Corona cases in India) బారినపడ్డారు. మరో 260 మంది మృతిచెందారు. ఒక్కరోజే 26,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases In India
దేశంలో కరోనా కేసులు

By

Published : Sep 26, 2021, 9:47 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Corona cases in India) స్వల్పంగా తగ్గాయి. తాజాగా 28,326 మందికి కొవిడ్​ (Coronavirus update) పాజిటివ్​గా తేలింది. మరో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 26,032 మంది వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 33,649,745
  • మొత్తం మరణాలు: 4,46,918
  • మొత్తం కోలుకున్నవారు: 3,29,02,351
  • యాక్టివ్ కేసులు: 3,03,476

టీకాల పంపిణీ..

దేశంలో ఇప్పటివరకు 85,60,81,527 టీకా డోసులను (covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శనివారం ఒక్కరోజే 68,42,786 వ్యాక్సిన్​ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) స్వల్పంగా తగ్గింది. తాజాగా 3,80,625 మందికి కొవిడ్​ ​(Corona update) సోకింది. వైరస్​​ ధాటికి మరో 5,961 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,22,78,968కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,57,346కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 54,114
  • బ్రెజిల్​ - 15,688
  • రష్యా - 22,041
  • బ్రిటన్ - 31,348
  • టర్కీ - 26,145
  • ఇరాన్ - 10,843

ఇదీ చూడండి:కేరళలో తగ్గిన కరోనా కేసులు- దేశంలో 85 కోట్ల టీకా డోసుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details