CM Jagan meeting with the party leaders:వైఎస్సార్సీపీలో మరికొంత మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల టికెట్లు చిరగనున్నాయి. ఎంతమందికి సీట్లు ఉంటాయి, పోతాయనే అనే విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. మరిన్ని స్థానాల్లో మార్పుల కోసం గడచిన రెండు రోజులుగా కసరత్తు చేస్తోన్న సీఎం ఇవాళ కూడా కసరత్తు కొనసాగించారు. ఎంపీలు ,ఎమ్మెల్యేలపై వేటు వేసి ఆ స్థానంలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించనున్నారు.
ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో ఇన్ చార్జీలను మార్చిన సీఎం వైఎస్ జగన్, 13మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపారు. పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల మార్పులపై కసరత్తు కొనసాగిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చిన మేరకు వారంతా బారులు తీరారు. పిలుపు మేరకు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అమలాపురం ఎంపీ చింత అనురాధ పార్లమెంట్ సీటు విషయమై చర్చించారు. కొన్ని రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతోన్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి మంతనాలు జరుపుతున్నారు. హిందూపురం ఎంపీ సీటు శాంత కు కేటాయించడంతో తన పరిస్థితి ఏంటని అడుగేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి సీఎంవో కు వచ్చారు. సీఎం వైఎస్ జగన్ ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. పార్టీ పెద్దలను కలసి ప్రసన్నం చేసుకుంటోన్న గోరంట్ల మాధవ్, తనకు ఏదేని శాసన సభ స్థానమైనా ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి బొత్స సత్య నారాయణ విజయనగరం ఎంపీ సీటు అభ్యర్థి విషయమై చర్చించారు. తన సతీమణి బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీకి బొత్స యత్నిస్తున్నారు. ఈ విషయమై సీఎంతో చర్చించారు.
"అందరం కష్టపడదాం.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిద్దాం"
కర్నూలు జిల్లా డోన్ లో నియోజకవర్గ సమన్వయకర్తను మార్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నుంచి మరో సారి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తను పోటీచేసే సీటు విషయమై చర్చించారు. ముందుగా ప్రాంతీయ సమన్వయకర్తలను కలసి చర్చించాక అవసరం మేరకు నేతలు సీఎంను కలిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ స్థానంలో కొత్త సమన్వయకర్తను మార్చాలని సీఎం నిర్ణయించారు. ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్యే గీతా శ్రీ పేరును పరిశీలిస్తున్నారు. ఈ సారి పోలవరం అసెంబ్లీ నుంచి నుంచి తన భార్యను బరిలో నిలపుతోన్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి మంతనాలు జరిపారు.
20 మంది మంత్రులు, 13 మంది మాజీలు ఓడిపోతారు: తులసి రెడ్డి
ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన మాజీ మంత్రి బాలినేనికీ ఇంకా ఆ సీటు పై సీఎం స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల దర్శి ఎమ్మెల్యేను ఒంగోలు నుంచి పోటీ చేయాలని కోరిన సీఎం ఆలోచించుకుని రావాలని సూచించారు. బాలినేని ని గిద్దలూరు నుంచి పోటీ చేయించే ప్రతిపాదనను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. తాను పోటీ చేసే స్థానం సహా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిపైనా చర్చించి ఖరారు చేయనున్నట్లు తెలిసింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఇప్పటికే పేరు ప్రకచించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే విష్ణు పార్టీవీడేందుకు సిద్దపడటం, షర్మిల రాగానే కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు వెళ్లాలని భావిస్తుడంటంతో వెల్లంపల్లికి పిలుపు వచ్చింది. ఎలా ముందుకు పోవాలనే విషయంపైనా చర్చించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ లకు సీఎం అపాయింట్ మెంట్ ఇచ్చారు. సీఎం జగన్ ను కలవనున్న నేతలు..తమ సీట్లు విషయమై చర్చించారు. పలు ఎంపీ నియోజకవర్గాల ఇన్ చార్జీల మార్పులపై ఇవాల ఎక్కువగా చర్చ జరుగుతోంది. కొన్ని ఎమ్మెల్యే సీట్లనూ సీఎం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇవాల లేదా రేపు 30స్థానాలతో జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి.
వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై జగన్ కసరత్తు - నేతలలో ఉత్కంఠ