తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బెయిలొస్తే సంబరాలా? అందుకే రద్దు చేస్తున్నాం.. వారంలో లొంగిపోవాలి'

CJI NV RAMANA COMMENTS: అత్యాచార నిందితుడికి బెయిల్ వచ్చిందని స్వాగతిస్తూ బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లో యువకుడిని పొగుడుతూ ప్రచారం జరిగింది. నిందితుడిని కీర్తిస్తూ అతని బంధువులు, అనుచరులు కరపత్రాలు అతికించారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి బెయిల్​ను రద్దు చేసింది. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

cji nv ramana
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

By

Published : May 6, 2022, 7:05 AM IST

CJI NV RAMANA COMMENTS: అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్‌ యువకుడు వ్యవహరించిన తీరుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యువకుడికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను గురువారం రద్దు చేసింది. బెయిలొచ్చిందని నిందితుడిని స్వాగతిస్తూ బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో 'భయ్యా తిరిగి వచ్చాడు' అంటూ పోస్టర్లు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లోనూ యువకుడిని ఆకాశానికెత్తుతూ ప్రచారం జరిగింది. యువకుడి బంధువులు, అనుచరులు అతడిని ఓ హీరోలా కీర్తిస్తూ వివిధ ప్రదేశాల్లో కరపత్రాలు అతికించారు.

వీటిపై ధర్మాసనం స్పందిస్తూ.. "నిందితుడి ప్రవర్తన బాధితురాలి మదిలో భయాలు రేకెత్తించేలా ఉంది. అతడు బెయిల్‌పై ఉంటే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా విచారణ జరగదన్న ఆందోళన ఆమెలో కలిగించేలా ఉంది. సాక్షులను ప్రభావితం చేస్తాడని ఆమె భావించేలా ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా నిందితుడు బెయిల్‌కు అర్హుడు కాదని భావిస్తున్నాం. హైకోర్టు తన బెయిల్‌ ఉత్తర్వుల్లో నిందితుడి నేర చరిత్రను ఉపేక్షించింది. అందుకే బెయిల్‌ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. వారం రోజుల్లో అతడు లొంగిపోవాలి" అని పేర్కొంది.

ఇదీ చదవండి:హీట్​వేవ్​పై మోదీ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక సూచనలు

ABOUT THE AUTHOR

...view details