హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ప్లాంట్ భద్రతను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) చేపట్టింది. శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను తమ అధీనంలోకి తీసుకుంది. పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని 64 మంది కమాండోలు నిరంతరం పహారా కాస్తున్నారు.
కేంద్ర బలగాల పహారాలో 'భారత్ బయోటెక్ ప్లాంట్'
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ప్లాంట్‌కు సీఐఎస్ఎఫ్ భద్రత ఏర్పాటు చేశారు. పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం పహారా కాస్తున్నారు.
భారత్ బయోటెక్
జీవ విపత్తుకు దారితీసే ఏదైనా ఉగ్ర ముప్పు లేదా విధ్వంసాల నుంచి రక్షణ కల్పించడానికి పటిష్ఠ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. సీఐఎస్ఎఫ్ కమాండోలు.. భారత్ బయోటెక్ ప్లాంట్‌ను పహారా కాసే నిర్ణయానికి ఇటీవలే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది.
ఇదీ చూడండి:పార్టీ కీలక నేతలతో ప్రధాని భేటీ