దిల్లీ నుంచి అసోం వెళ్తున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని పట్టుకున్నారు పోలీసులు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ చేపట్టిన సయుక్త తనిఖీల్లో సుమారు కోటి రూపాయల వరకు ఫోర్జరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 10 వేలు విలువ చేసే సాధారణ నోట్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రైల్లో కోటి రూపాయల నకిలీ కరెన్సీ - fake currency notes in train
దిల్లీ నుంచి అసోం వెళ్తున్న ఓ రైలులో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ బయట పడింది. పోలీసు బృందాల తనిఖీల్లో.. ఈ విషయం వెలుగుచూసింది.
Chandauli : One crore fake currency found in Kamakhya Express
ఈ మొత్తాన్ని రాబోయే బంగాల్, అసోం ఎన్నికలలో ఉపయోగించుకోవాలని ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.