తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైనుల ఆందోళనలకు దిగొచ్చిన సర్కార్​.. శ్రీ సమ్మత్​ శిఖరాజి తీర్థంపై కీలక ఆదేశాలు!

జైనుల ఆందోళనల మధ్య కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ సమ్మత్​ శిఖరాజి తీర్థ్‌ను పర్యటక ప్రాంతంగా మార్చవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పరసనాథ్​ హిల్స్‌లో ఎటువంటి పర్యటక కార్యకలపాలు చేపట్టవద్దంటూ ఝార్ఖండ్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

center-responded-to-jains-agitation-gave-orders-on-shri-sammat-shikharaji-tirth
జైనులు ఆందోళలనకు స్పందించిన కేంద్రం

By

Published : Jan 6, 2023, 12:50 PM IST

శ్రీ సమ్మత్​ శిఖర్​ జీ పర్వత శ్రేణిని ఝార్ఖండ్‌ ప్రభుత్వం పర్యటక ప్రాంతంగా ప్రకటించడంపై జైనులు తీవ్ర నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఆ ప్రాంతంలో ఎలాంటి పర్యటక కార్యాకలాపాలు చేపట్టవద్దంటూ ఝార్ఖండ్​ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.

ఝార్ఖండ్‌లోని గిరిద్‌ జిల్లాలో పరసనాథ్​ హిల్స్‌పై ఉన్న శ్రీ సమ్మత్​ శిఖరాజి పుణ్యక్షేత్రాన్ని ఏటా లక్షలాది మంది జైనులు సందర్శిస్తారు. ఈ మందిరాన్ని ఎకో సెన్సిటివ్​ జోన్​గా మార్చాలంటూ 2018లో కేంద్రాన్ని కోరింది ఝార్ఖండ్​ ప్రభుత్వం. 2019లో ఎకో సెన్సిటివ్​ జోన్​గా కేంద్రం ప్రకటించింది కేంద్రం. కానీ ఝార్ఖండ్​ ప్రభుత్వం పర్యటక ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జైనులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వారు నిరసన చేపట్టారు. సమ్మత్​ ​ శిఖరాజి తీర్థ్‌ను పర్యటక ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఆ స్థలం పవిత్రత దెబ్బతింటుందని జైనులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details