కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ నివాసంలో సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు నిర్వహించింది. బేగ్ నివాసానికి ఉదయం చేరుకున్న సీబీఐ.. ఆయన కుమారుడి కార్యాలయం, ఇంటిలోనూ తనిఖీలు చేపట్టింది.
వందల కోట్ల రూపాయల 'ఐఎంఏ' పోంజి కుంభకోణం కేసులో బేగ్ ఆదివారం అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయన పరప్పణ అగ్రహార జైలులో క్వారంటైన్లో ఉన్నారు.