తెలంగాణ

telangana

ETV Bharat / bharat

​ ఎంపీ మోహన్​ దేల్కర్​ ఆత్మహత్యపై ఎఫ్​ఐఆర్​ నమోదు

దాద్రానగర్​ హావేలీ ఎంపీ మోహన్​ దేల్కర్​ ఆత్మహత్య ఘటనలో ముంబయి పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. కేసును ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు.

Case registered in MP Mohan Delkar suicide case
​ ఎంపీ మోహన్​ దేల్కర్​ ఆత్మహత్యకేసులో ఎఫ్​ఐఆర్​ నమోదు

By

Published : Mar 10, 2021, 4:06 PM IST

దాద్రానగర్​ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్​ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసులు బుధవారం ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. దేల్కర్​ మృతికి సంబంధించి మంగళవారం ఆయన కుటుంబ సభ్యలు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముంబయిలోని సముద్ర తీర ప్రాంత హోటల్​లో ఫిబ్రవరి 22న మోహన్ దేల్కర్​ ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా ప్రదేశంలో దేల్కర్​ పేరుతో ఉన్న 15 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ లేఖలో కొందరి పేర్లు ఉన్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్ముఖ్​ తెలిపారు.

దాద్రానగర్​ హావేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్​ ప్రపుల్ల్​ ఖేడా పటేల్​ పేరు ఉన్నట్లు అసెంబ్లీలో హోంమంత్రి తెలిపారు. కేసును ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తామని వెల్లడించారు.

మంగళవారం రోజు సీఎం ఉద్ధవ్​ ఠాక్రేని దెల్కర్​ భార్య, కుమారుడు అభినవ్​ దేల్కర్​ కలిశారు. తన తండ్రిని ప్రపుల్ల్​ ఖేడా పటేల్​ తీవ్రంగా వేధించిండని అభినవ్​ దేల్కర్​ ఆరోపించారు.

ఇదీ చూడండి:లోక్​సభ ఎంపీ మోహన్ ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details