కొవాగ్జిన్ టీకా తీసుకున్నవారికి మరోసారి కొవిషీల్డ్(Covishield Vaccine News) వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించి ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొవాగ్జిన్(Covaxin Who Approval) టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అనుమతి లేకపోవటం వల్ల విదేశాలకు వెళ్లేందుకు భారత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రజలకు మరోసారి వ్యాక్సినేషన్ అందించటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తమ దగ్గర సమాచారం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
" ప్రజలకు మరోసారి వ్యాక్సినేషన్ అందించమని కేంద్రాన్ని ఆదేశించి ప్రజల ప్రాణాలను ఇబ్బందుల్లో పెట్టలేం. వ్యాక్సినేషన్‌కు సంబంధించి మావద్ద ఎలాంటి సమాచారం లేదు. డబ్ల్యూహెచ్ఓ అనుమతి కోసం భారత్ బయోటెక్ సంస్థ దరఖాస్తు చేసుకున్నట్లు పత్రికల్లో చదివాం. అందువల్ల డబ్యూహెచ్ఓ సమాధానం కోసం వేచిచూద్దాం. ఇదే విషయంపై దీపావళి తర్వాత చర్చిస్తాం."