తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు పక్కన గంజాయి మొక్కల పెంపకం!

కేరళ కొల్లం జిల్లాలో రోడ్డు పక్కన నాటిన గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అసాంఘిక శక్తులు వీటిని నాటాయని తెలిపారు.

Cannabis plant found
గంజాయి మొక్కలు

By

Published : Jun 7, 2021, 6:57 PM IST

కేరళలోని కొల్లాం జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన గంజాయి మొక్కలను నాటారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి మొక్కను పరిశీలిస్తున్న అధికారులు

ఇలా బయటపడింది..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కందిచీరా ప్రాంతంలో స్థానికులు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అయితే వాటిలో కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయి. స్థానికులు మొక్కలతో ఫొటోలు దిగుతున్న సమయంలో వీటిని గుర్తించారు. చూసేందుకు అనుమానాస్పదంగా ఉన్నందున అధికారులకు సమాచారం ఇచ్చారు. వాటిని పరిశీలించిన పోలీసులు గంజాయి మొక్కలుగా తేల్చారు.

ఇప్పటికే గంజాయి సాగుపై కేసు నమోదై ఉన్న ఓ యువకుడు వీటిని నాటినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. అతడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:కట్టుబాట్లు ఛేదిస్తూ.. మృతదేహాలను దహనం చేస్తూ..

ABOUT THE AUTHOR

...view details