ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బంగాల్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం రాష్ట్రంలో పర్యటించిన షా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అమలుచేస్తోన్న పథకాల ద్వారా రాష్ట్ర పేద ప్రజలు లబ్ధి పొందకుండా అడ్డుకుంటున్నారని బంగాల్ ముఖ్యమంత్రిని తప్పుపట్టారు.
" బుధవారం రాత్రి నుంచి బంగాల్లోనే ఉన్నాను. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందని నా నమ్మకం. దీదీ పాలన అంతం అయ్యే సమయం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో బంగాలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుంది".