తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సకల సౌకర్యాల 'సైకిల్​ క్యాంపర్​'.. బీటెక్​ విద్యార్థి ఘనత - కొజికోడ్​

Camping vehicle: దేశవ్యాప్తంగా పర్యటించడమే లక్ష్యంగా సొంత వాహనం సిద్ధం చేసుకున్నాడు కేరళకు చెందిన ఓ మెకానికల్​ విద్యార్థి. సైకిల్​ క్యాంపర్​గా పిలిచే ఈ వాహనంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఆ వాహనం ప్రత్యేకత ఏమిటో మనమూ చూద్దాం రండీ.

camping vehicle
సైకిల్​ క్యాంపర్

By

Published : Jan 21, 2022, 7:51 PM IST

సైకిల్​ క్యాంపర్ వాహనం రూపొందించిన మెకానికల్​ విద్యార్థి

Camping vehicle: దూర ప్రాంతాల్లో పర్యటించాలంటే అన్ని సౌకర్యాలతో కూడిన వాహనం అవసరమవుతుంది. అందుకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలా మంది ట్రావెలర్స్​కు అది సాధ్యపడకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఓ విద్యార్థి సరికొత్త ఆలోచన చేశాడు. దేశవ్యాప్తంగా పర్యటించాలనే లక్ష్యంతో సొంతంగా ఓ​ వాహనాన్ని రూపొందించాడు. అతనే కేరళలోని కొజికోడ్​ జిల్లా పదనిలమ్​కు చెందిన మెకానికల్​ ఇంజినీరింగ్​ విద్యార్థి ఆకాశ్​ కృష్ణ.

మెకానికల్​ విద్యార్థి ఆకాశ్​ కృష్ణ

తొలుత పాతసామన్ల దుకాణం నుంచి తీసుకొచ్చిన సామగ్రితో గేర్​ సైకిల్​ను రూపొందించాడు ఆకాశ్​. సైకిల్​కు ఓ మోటార్​ను బిగించాడు. ఆ తర్వాత ట్రావెలింగ్​ కోసం రూపొందించిన 'క్యాంపర్​-క్యాప్సుల్​'ను జత చేశాడు.

క్యాంపర్​ వాహనాన్ని పీవీసీ బోర్డులు, మెటల్​ ఫ్రేములతో సిద్ధం చేశాడు ఆకాశ్​. అందులో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా నిద్రపోవచ్చు. అలాగే.. చిన్న ఫ్రిడ్జ్​, ఇన్వర్టర్​, వాటర్​ కూలర్​, టీవీ, ఎగ్జాస్ట్​ ఫ్యాన్​, సెక్యూరిటీ అలారమ్​ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు కోసం క్యాంపింగ్​ క్యాప్సుల్​పై సోలార్​ ప్యానల్స్​ను బిగించాడు. క్యాంపర్​కు స్కూటర్​ టైర్లు వినియోగించాడు. ఇందు కోసం రూ.65వేలు ఖర్చు చేశానని.. ఈ క్యాంపర్​ సాయంతో దేశవ్యాప్తంగా పర్యటించాలనేదే తన లక్ష్యమని తెలిపాడు.

క్యాంపింగ్ వెహికిల్​లో ఆకాశ్​ కృష్ణ

తన ప్రత్యేక వాహనంలో ప్రయాణించేందుకు అనుమతి కోసం రాష్ట్ర మోటార్​ వెహికిల్​ విభాగాన్ని ఆశ్రయిస్తానని, అనుమతులు వచ్చాక ముందుగా రాష్ట్రం మొత్తం చక్కర్లు కొట్టొస్తానని చెబుతున్నాడు ఆకాశ్​ కృష్ణ.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:స్నేక్ శరణ్య: పాములు పట్టడంలో సెంచరీ కొట్టిన యువతి

ABOUT THE AUTHOR

...view details