Boy Chokes to Death: గొంతులో బాటిల్ మూత ఇరుక్కొని ఊపిరాడక 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన హరియాణాలోని అంబాలాలో వెలుగు చూసింది. బాధితుడు అంబాలా కంటోన్మెంట్లోని డిఫెన్స్ కాలనీకి చెందిన యశ్గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం అతడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు.
ఇదీ జరిగింది:శుక్రవారం రాత్రి శీతల పానీయం బాటిల్ మూత తెలిచేందుకు యశ్ సోదరి ఇబ్బందులు పడింది. దీంతో తాను తీస్తానని చెప్పి నోటితే తెరిచేందుకు ప్రయత్నించాడా బాలుడు. ఒక్కసారిగా తెరుచుకున్న క్యాప్.. గొంతులోకి వెళ్లింది. శ్వాసనాళానికి అడ్డుపడటం వల్ల ఊపిరాడక యశ్ ఇబ్బంది పడ్డాడు. మూతను గొంతులోంచి తీసేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.