బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసులపై 10 వారాల సమయం కావాలన్న సోనూసూద్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. గురువారం జరిపిన విచారణ సందర్భంగా పిటిషనర్‌కు చాలా సమయమే లభించిందని వ్యాఖ్యానించింది.
సోనూసూద్ పిటిషన్‌ను తిరస్కరించిన బాంబే హైకోర్టు - సోనూసూద్
బృహన్ ముంబయి కార్పొరేషన్ నోటీసులకు సంబంధించి సమయం కావాలన్న సోనూసూద్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అనుమతులు లేకుండానే నివాసాన్ని హోటల్ భవనంగా మార్చారని బీఎంసీ తన నోటీసులో పేర్కొంది.
సోనూసూద్ పిటిషన్‌ను తిరస్కరించిన బాంబే హైకోర్టు
సోనూసూద్ ముంబయిలోని తన నివాస భవనం శక్తిసాగర్‌ను అవసరమైన అనుమతులు తీసుకోకుండా హోటల్ భవనంగా మార్చారని బీఎంసీ తన నోటీసులో పేర్కొంది. ఈ విషయంపై సోనూసూద్ ఇప్పటికే జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. తాజాగా హైకోర్టు కూడా ఇదే తీర్పును వెల్లడించింది.
ఇదీ చదవండి :టీకా తీసుకునేందుకు 80 శాతం మంది రెడీ!