rakesh tikait latest news: సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్‌పై సిరా దాడి జరిగింది. బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనపై కొందరు ఇంక్ పోశారు. ఈ పరిణామంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. సిరా దాడి చేసిన వారిని అడ్డుకుని, కొట్టారు. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
రాకేశ్ టికాయిత్‌పై ఇంక్ దాడి- ప్రభుత్వం కుట్రేనట! - ఇంకు దాడి
rakesh tikait latest news: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్‌పై సిరా దాడి జరిగింది. బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనపై కొందరు ఇంక్ పోశారు.
సిరా దాడిపై తీవ్రంగా స్పందించారు రాకేశ్ టికాయిత్. తన కార్యక్రమానికి స్థానిక పోలీసులు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. కొందరితో ప్రభుత్వం కుమ్మక్కై ఇలా చేసిందని ఆరోపించారు.
పోలీసుల అదుపులో ముగ్గురు: భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్‌పై సిరా దాడి ఘటనపై చర్యలు చేపట్టారు బెంగళూరులోని హైగ్రౌండ్స్ ఠాణా పోలీసులు. ఇంక్ చల్లినట్లు భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
ఇదీ చూడండి:'రాజ్యసభకు నేను సరిపోనా?'.. కాంగ్రెస్‌పై నగ్మా ఫైర్