కరోనా నుంచి కోలుకున్న కొందరు బ్లాక్ఫంగస్ బారిన పడుతుండడం వల్ల కేంద్రం అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే మందులను వేగంగా ఉత్పత్తి చేయాలని కంపెనీలను కేంద్ర రసాయనాల మంత్రిత్వశాఖ ఆదేశించింది.
కరోనా నుంచి కోలుకున్న కొందరిలో గుర్తించిన సోకే మ్యుకర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) మొదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వ్యాధి ముదిరితే ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.