పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో మొత్తం 30 స్థానాల్లో.. ఎన్డీఏ 16 సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. అయితే ముఖ్యమంత్రి ఎవరు? ఏ పార్టీనుంచి ఉంటారు? అనే సందిగ్ధం ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంలో కొనసాగుతోంది.
'సీఎం సీటు మాకే'!
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, రంగస్వామి కాంగ్రెస్తో కలిసి కూటమిగా ఏర్పడింది భాజపా. తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి.. ఆరు స్థానాల్లో విజయం సాధించింది. తమకు ముఖ్యమంత్రి సీటు కావాలని భాజపా పట్టుబడుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
ఎన్నికల తరువాత తానే ముఖ్యమంత్రిని అవుతానని ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి ఇప్పటివరకు చెప్పుకుంటూ రావడం గమనార్హం.