భారత సేవాశ్రమ్ సంఘ్... బంగాల్లో స్వామి ప్రణవానంద 1917లో స్థాపించిన ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి వంటశాలల్లో శాకాహారం మాత్రమే వండేందుకు అనుమతి ఉండేది. కానీ.. ఇప్పుడు కరోనా కాలంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఆశ్రమంలోనే కొవిడ్ బాధితుల కోసం తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. వారిలో రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు.. 104 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కనబెట్టారు. గుడ్లు, మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాలను వండి, అందించేందుకు అనుమతి కల్పించారు.
ఈ నెల 21నే కోల్కతా గరియాలో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కరోనా బాధితుల కోసమే రెండు ఫ్లోర్లు కేటాయించారు. మతవిశ్వాసాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండటం కంటే.. ప్రస్తుత సమయంలో బాధితులు కోలుకోవడం కోసం సాయం చేయడమే మంచి నిర్ణయమని అంటున్నారు నిర్వాహకులు.