బెంగళూరులో జరిగిన హింసాత్మక ఘర్షణలో మతసామరస్యం వెల్లివిరిసింది. ఆ నిరసనల్లో డీజే హళ్లిలోని స్థానిక మందిరానికి ఎలాంటి హాని కలగకుండా ముస్లిం యువకులు అడ్డుకోవడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
నిరసనలు జరిగిన ఎమ్మెల్యే నివాసం ముందే మందిరం ఉంది. ఆందోళనకారుల దాడిలో మందిరం ధ్వంసం కాకుండా కొంతమంది మానవహారం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు మందిరం చుట్టూ అడ్డుగోడగా నిలబడ్డారు.