తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యముడి గుడి కోసం అలుపెరగని పోరాటం - telugu latest national news

మృత్యువు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది యముడు. యమధర్మరాజును పూజించే వారు చాలా అరుదు. అలాంటిది యముడికి పరమ భక్తుడైన ఓ వ్యక్తి ఆయనకు ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయడం లేదు. మరి ఆ ఆలయం ఎక్కడ అని ఆశ్యర్చపోతున్నారా?.. అయితే ఈ కథనం చదవండి.

Yamraj temple in mandya
యముడి గుడి కోసం భక్తుడు అలుపెరగని పోరాటం

By

Published : Jan 10, 2020, 9:50 AM IST

Updated : Jan 10, 2020, 1:18 PM IST

యముడి గుడి కోసం అలుపెరగని పోరాటం

యమధర్మ రాజు. ఈ పేరు వినగానే హిందువుల్లో ఏదో తెలియని భయం. దేశంలో ఎందరో దేవుళ్లకు ఆలయాలున్నా.. యముడిని ఆరాధించే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ యముడికి పరమభక్తుడైన ఓ వ్యక్తి ఆయనకు గుడి నిర్మిస్తున్నాడు.

కర్ణాటకలోని మండ్య జిల్లా బోర్​ అనందూరు గ్రామానికి చెందిన రాజు.. యముడికి ఆలయాన్ని కట్టిస్తున్నాడు. గుడి నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని కొనేశాడు. పనులు కూడా పూర్తయ్యాయి. కానీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు సిద్ధపడుతున్న తరుణంలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాన్ని కూల్చేశారు. జనవరి 18న విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాలన్న రాజు ఆకాంక్ష నెరవేరలేదు. వెనకడుగు వేయకుండా.. తిరిగి పనులు ప్రారంభించాడు.

గతంలో శని శింగణాపురలో శని దేవునికి ఆలయాన్ని నిర్మించాడు రాజు. కొంతమంది భక్తులు రాజు అభిప్రాయానికి మద్దతుగా నిలుస్తున్నారు. యమధర్మరాజు హిందువుల భగవంతుడని, ఆయనను ఆరాధించాలని రాజు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సుప్రీం

Last Updated : Jan 10, 2020, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details