తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యమున ఉగ్రరూపం.. దిల్లీకి ప్రమాద హెచ్చరిక

దిల్లీలోని యమునా నదిలో వరద ఉద్ధృతి ప్రమాదస్థాయికి చేరింది. ఈ రోజు ఉదయం నుంచి క్రమక్రమంగా నీరు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముప్పు పొంచి ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు అధికారులు. పరిస్థితిని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రివాల్​ సమీక్షిస్తున్నారు.

దిల్లీ: ప్రమాదస్థాయిలో యమునా నది ప్రవాహం

By

Published : Aug 19, 2019, 3:22 PM IST

Updated : Sep 27, 2019, 12:50 PM IST

ప్రమాదస్థాయిలో యమునా నది ప్రవాహం

దిల్లీలోని యమునా నదికి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎగువ ఉన్న హిమాచల్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం.

యమునా నది నీటి మట్టం సోమవారం ప్రమాదస్థాయిని దాటింది. హత్నికుండ్​ బ్యారేజ్​ నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడం వల్ల ఈరోజు ఉదయం యమునా నదిలో నీటిమట్టం 204.70 మీటర్లుగా నమోదయింది.

ప్రభుత్వ చర్యలు...

హత్నికుండ్​కు సమీపంలోని యమునా నది పరివాహక ప్రాంతమైన కాంచన్​బాగ్​ కాలనీని పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. ఓక్లా ప్రాంతంలోని కెనాల్​ నగర్​వాసులనూ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో సుమారు 100 కుటుంబాలున్నాయి. పురాణా దిల్లీలోని ఐరన్​ బ్రిడ్జ్​పై రాకపోకలను నిలిపివేశారు.

వరద నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రివాల్​ అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:- డ్రగ్స్​ వద్దన్నాడని.. తండ్రినే హతమార్చిన తనయ!

Last Updated : Sep 27, 2019, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details