తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జేఎన్​యూ దాడి సిగ్గుచేటు.. న్యాయవిచారణ జరిపించండి'

జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్​యూ)లో జరిగిన హింసాత్మక ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఈ ఘటనను నాజీ తరహా దాడిగా అభివర్ణించారు కేరళ ముఖ్యమంత్రి.

violence-in-jnu-highly-condemnable-shameful-mayawati
'సంఘ్​ పరివార్​ రక్తపాతం సృష్టించొద్దు.. దాడి అవమానకరం'

By

Published : Jan 6, 2020, 9:50 AM IST

Updated : Jan 6, 2020, 11:56 AM IST

'సంఘ్​ పరివార్​ రక్తపాతం సృష్టించొద్దు.. దాడి అవమానకరం'

దిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం-జేఎన్​యూలో జరిగిన దాడిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

జేఎన్​యూలో దాడిని తీవ్రంగా ఖండించారు కేరళ సీఎం పినరయి విజయన్​. విశ్వవిద్యాలయాల్లో రక్తపాతం సృష్టించే దాడుల నుంచి సంఘ్‌ పరివార్‌ వైదొలగాలని ఆయన సూచించారు. దేశంలో అశాంతి, హింసను సృష్టించాలనుకునే వారే విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడి చేశారని ఆరోపించారు విజయన్​. ఈ ఘటనను నాజీ తరహా దాడిగా అభివర్ణించారు.

రక్తపాతం సృష్టించే దాడుల నుంచి సంఘ్​ పరివార్​ వైదొలగాలి: విజయన్​

దాడి సిగ్గుచేటు..

దాడి సిగ్గుచేటు: మాయావతి

విద్యార్థులు, టీచర్లపై దాడి ఘటనను బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా ఖండించారు. ఈ హింసాత్మక దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాయావతి. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా పరిగణించి న్యాయ విచారణకు ఆదేశించాలని ట్వీట్​ చేశారు.

Last Updated : Jan 6, 2020, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details