నదిలో మృతదేహాన్ని మోస్తేనే అంతిమ వీడ్కోలు! రాజస్థాన్ దుంగార్‌పుర్‌లోని మాండ్వా గ్రామంలో ఎవరైనా మరణిస్తే... మనసారా అంతిమ వీడ్కోలు పలికేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు నానా తంటాలు పడుతున్నారు. దహన సంస్కారాలు నిర్వహించాలంటే ఎనికట్ పర్వత ప్రాంత రాజ్‌సమండ్‌లోని శ్మశానానికి మృతదేహాన్ని తీసుకువెళ్లాలి. కానీ, ఆ మార్గంలో శవయాత్రలో పాల్గొనాలంటే డిమియా నదీ ప్రవాహాన్ని ఎదుర్కొని ముందుకు నడవాల్సిన పరిస్థితి.
ఇటీవల ఇక్కడ ఓ మహిళ మరణించింది. భారీ వర్షాలకు డిమియా నదిలో నీటి మట్టం పెరగడం వల్ల మృతదేహాన్ని ముక్తి ధామ్(శ్మశానం)కు తీసుకువెళ్లేందుకు బంధువులు పాడె మోస్తూ 3 అడుగుల నీటి ప్రవాహంలో నడిచారు. నీటి ఉద్ధృతికి భయపడి కొందరు శ్మశానానికి కొద్ది దూరంలోనే ఉండిపోయారు.
కొన్నేళ్లుగా గ్రామస్థులు శ్మశానవాటికను చేరేందుకు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు. నదిలో నీటి వేగం పెరిగినప్పుడు మృతదేహాన్ని మోసేవారికి ప్రమాదం మరింత ఎక్కువే. 2006లో ఓ శవయాత్ర సమయంలో అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మరణించాడు.
ఇంత జరిగినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటివరకు ఈ గ్రామానికి ఓ వంతెన నిర్మించడం లేదని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:తప్పతాగి తప్పుడు పనికి యత్నిస్తే ఉతికారేశారు!