తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాణాలు వేయడంలో 'దేవసేన'ను మించిన నైపుణ్యం వీరిది!

ఝార్ఖండ్​లోని పడిహాస్​ గ్రామంలో గిరిజన వాసుల ప్రాచీన విలువిద్య పోటీలు ఘనంగా జరిగాయి. నాటి బ్రిటీష్​ పాలకులతో పోరాడిన తమ పూర్వీకులను స్మరిస్తూ ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారు.

archery
బాణాలు వేయడంలో 'దేవసేన'ను మించిన నైపుణ్యం వీరిది!

By

Published : Feb 10, 2020, 4:33 PM IST

Updated : Feb 29, 2020, 9:22 PM IST

ఝార్ఖండ్​లోని పడీహాస్​ గ్రామంలో గిరిజన వాసుల విలువిద్య పోటీ కనులవిందుగా జరిగింది. వేలాది మంది ఆదివాసీలు ఇందులో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని తమ పూర్వీకుడైన స్వాతంత్ర సమరయోధుడు బాబా తిలక్​ మాంఝీ వర్థంతి సందర్భంగా ఘనంగా జరుపుకున్నారు.

బాణాలు వేయడంలో 'దేవసేన'ను మించిన నైపుణ్యం వీరిది!

యోధులను స్మరిస్తూ

విలు విద్య... భారతీయ సంప్రదాయ కళల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నాటి బ్రిటీష్​ పాలకులను చీల్చి చెండాటంలో ముఖ్య పాత్ర పోషించింది. గిరిజన తెగకు చెందిన బిర్సా ముండా, చాండ్​ భైరవ్​, సిద్ధ్​-కాన్హూ, తిలక్​ మాంఝీ ఈ విల్లునే చేతపట్టి ఆంగ్లేయులపై పోరాడారు. వారిని, వారి ధైర్య సాహసాలను స్మరిస్తూ ఈ విలువిద్య పోటీలను ఆదివాసీలు ఘనంగా జరుపుకుంటారు.

వేలాది మంది

ఈ పోటీల కోసం చుట్టు పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆదివాసీలు తరలివస్తారు. వందలాది మంది మహిళలు, పురుషులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు.

భావి తరాల కోసం

ఆదివాసీల సంస్కృతి, వారసత్వాన్ని ఈ విలువిద్య పోటీలు ఉట్టిపడేలా చేస్తాయి. ఆనాటి పోరాట యోధుల ధైర్యసాహసాల గురించి భావి తరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఏటా ఈ విలువిద్య పోటీలు జరుపుతున్నట్లు తెలిపారు నిర్వహకులు.

ఇదీ చూడండి: దిల్లీ ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?

Last Updated : Feb 29, 2020, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details