తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థులు వర్సెస్ వీసీ : దిల్లీ జేఎన్​యూలో ఉద్రిక్తత - విద్యార్థులు

దిల్లీలోని జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆన్​లైన్​ ప్రవేశాలను వ్యతిరేకిస్తూ వీసీ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థులతో పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఉపకులపతి, విద్యార్థులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

విద్యార్థులు వర్సెస్ వీసీ:దిల్లీ జేఎన్​యూలో ఉద్రిక్తత

By

Published : Mar 26, 2019, 8:00 PM IST

విద్యార్థులు వర్సెస్ వీసీ:దిల్లీ జేఎన్​యూలో ఉద్రిక్తత
దిల్లీలోని జవహార్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు... పోలీసులకు మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం జరిగింది. తన నివాసంలోకి మూకుమ్మడిగా ప్రవేశించటానికి విద్యార్థులు ప్రయత్నించారని, కొన్ని గంటల పాటు తన భార్యను ఇంట్లోనే ఉండేలా చేసి భయాందోళనలకు గురిచేశారని ఉపకులపతి(వీసీ) ఆరోపించారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని, నిరసనలు చేసే పద్ధతి ఇదేనా? అని ట్విట్టర్​ వేదికగా ఆయన ప్రశ్నించారు.

వీసీ ఆరోపణలు ఖండించిన వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు... వీసీని కలవటానికి వెళ్లిన తమపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారని ఆరోపించారు.

కొత్త విధానం వద్దు: విద్యార్థులు

ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టనున్న ఆన్​లైన్​ ప్రవేశ పరీక్షల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏడుగురు విద్యార్థులు గత వారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. తమ వాదన వినాలని కోరుతున్నప్పటికీ... వీసీ స్పందించకపోవడం వల్ల ప్రత్యక్షంగా కలవటానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గత వారం భేటీ సంతృప్తికరంగా జరగలేదు.

వీసీ నివాసంలోకి వెళ్లిన విద్యార్థులు, ఆయన సతీమణిని చుట్టుముట్టారు. పోలీసులతో కలిసి మేము కాపాడాము. ఆస్వస్థతకు గురైన ఆవిడ ఆస్పత్రిలో చేరారు.-ఆచార్యుడు

ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details