తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయు 'వర్ధమాను'లు - simhakutty

వింగ్ కమాండర్ అభినందన్​ వర్ధమాన్​ కుటుంబానికి భారత వాయుసేనకు విడదీయరాని అనుబంధం ఉంది. 'మిగ్'​ విమానాన్ని తండ్రి పరీక్షించగా కుమారుడు అభినందన్ నడిపాడు.

వర్ధమానులు

By

Published : Mar 1, 2019, 3:44 PM IST

'మిగ్​-21' యుద్ధవిమానాన్ని నడపటమనేది ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కుటుంబానికి సంప్రదాయంగా మారింది. అతని తండ్రి విశ్రాంత ఎయిర్ మార్షల్ సింహకుట్టీ వర్ధమాన్​ సైతం మిగ్-21ను తొలినాళ్లలో పరీక్షించారు. ఐదేళ్ల క్రితమే పదవీ విరమణ చేశారు సింహకుట్టీ. అభినందన్​ తండ్రే కాదు..తాత కూడా భారత వాయుసేనకు చెందినవారే.

వర్ధమాన్ కుటుంబ విశేషాలను ఆంగ్ల వార్తాసంస్థకు సింహకుట్టీ మిత్రుడు, విశ్రాంత వింగ్ కమాండర్ ప్రకాశ్ నావలే తెలియజేశారు. సింహకుట్టీ, ప్రకాశ్​ 1969-72 జాతీయ రక్షణ అకాడమీ(ఎన్డీఏ) బ్యాచ్​కు చెందినవారు. ఆ సమయంలోనే మూడేళ్ల వయసున్న అభినందన్​ను చూశానని ఆయన వెల్లడించారు.

"హైదరాబాద్ హకీంపేటలో మొదటిసారిగా శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. అమరావతినగర్ సైనిక్​ పాఠశాలలో సింహకుట్టీ చదువుకున్నారు. ఆయన భార్య శోభ వైద్యురాలు. సింహకుట్టీ తండ్రి కూడా వాయుసేనలో పనిచేశారు. తండ్రి, తాతయ్యల స్ఫూర్తితో అభినందన్ వాయుసేనలో చేరారు."
- ప్రకాశ్ నావలే, విశ్రాంత వింగ్ కమాండర్

ప్రకాశ్ నావలే

1982లో ప్రకాశ్​ నావలేకు 'శౌర్యచక్ర అవార్డు'ను భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్​ను దాడి నుంచి కాపాడినందుకు ఆయనను ప్రభుత్వం సత్కరించింది.

ఇదీ చూడండి:పాక్​ వెనక్కి తగ్గిందిందుకే..

ABOUT THE AUTHOR

...view details