తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అన్నీ మాట్లాడతా... ఆ ఒక్కటి మినహా!'

ఊర్మిళ మతోంద్కర్​... ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోన్న బాలీవుడ్ తార. దీనికి కారణం ఈమె కాంగ్రెస్​ పార్టీలో చేరటమే. రాజకీయాలపై ఆమె అభిప్రాయాలు ఏంటి? లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా?

'దేశ ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు.. అందుకే వస్తున్నా!'

By

Published : Mar 29, 2019, 6:53 AM IST

సినీనటి ఊర్మిళతో ఈటీవీ భారత్​ ముఖాముఖి
సినీతారలు రాజకీయాల్లో చేరి రాణించటం సర్వసాధారణం. అందునా ఎన్నికల వేళ సెలబ్రిటీలు వివిధ పార్టీల్లో చేరటం ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. ఈ జాబితాలో ఇటీవలే బాలీవుడ్​ తార ఊర్మిళ మతోంద్కర్​ చేరారు. రాహుల్​ గాంధీ సమక్షంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. రంగస్థలం మీద మంచి పేరు సంపాదించిన ఈ కథానాయిక రాజకీయాల్లోనూ రాణించాలని ఆశిస్తున్నారు.

రాజకీయాలు, లోక్​సభ ఎన్నికల్లో పోటీ, దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఈటీవీ భారత్​తో ముచ్చటించారు ఊర్మిళ.

రాజకీయాల్లో చేరాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?

దేశంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే... మన దగ్గర ఏం జరుగుతోందో మనకే తెలియట్లేదు. ప్రతిదాని గురించి మాట్లాడేందుకు, వినేందుకు, అర్థం చేసుకోవటానికి ఉన్న స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితి మరింత దారుణంగా మారితే దేశం మన చేతుల నుంచి జారిపోతోంది. ఇప్పుడున్న భారత్​ను ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఎప్పట్నుంచో పాటిస్తున్న కొన్ని సిద్ధాంతాలు భారత్​కు దూరమయ్యాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించాల్సి ఉంది. దీనికి ఒకటే దారి ఉంది. అదే అభివృద్ధి. సంతోషం, వికాసం, సానుకూల ఆలోచనతో నిర్మితమైన సమాజాన్ని ప్రపంచంలోని ఇతరులు గౌరవిస్తారు. సమాజంలో జాతి, మతం, నిరక్షరాస్యత లాంటి విభజనలు ఉన్నాయి. వ్యవస్థ నాశనం అవుతోంది. వీటన్నింటిని ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చాను.

నటీనటులు సులభంగా ఇతరులకు లక్ష్యం అవుతారు. అంతా ఎప్పుడూ విమర్శిస్తుంటారు. అందుకే ముఖ్యమైన అంశాల గురించి కూడా బాలీవుడ్​ స్టార్లు తక్కువగా మాట్లాడతారు. మీరు ఎందుకు స్పందిస్తున్నారు?

నేను కూడా చాలా సంవత్సరాల వరకు మాట్లాడలేదు. ఇంతకుముందే స్పందించనందుకు నేను చింతిస్తున్నాను. కానీ ఎప్పుడో స్పందించాల్సింది. ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు ప్రజలకు చేరుతున్నాయని భావిస్తున్నాను. అందరికీ నేను సులభమైన లక్ష్యంగా మారతాను. వారు నన్ను లక్ష్యంగా చేసుకునేందుకు అనేక అంశాలున్నాయి. వారిని విమర్శించనివ్వండి. ఇప్పుడు నేను వెనక్కి తగ్గేది లేదు. ఒక నాగరిక వ్యక్తిగా నేను కొంచెం ఆలోచిస్తాను, అర్థం చేసుకుంటాను. భారతీయులమని ఆలోచించే వారిని మాట్లాడకుండా చేయొచ్చు. ప్రస్తుతం నడుస్తోన్న రాజకీయం ఇదే. వీటన్నింటి కంటే కూడా ప్రజల పక్షాన నిలబడేందుకే ప్రయత్నం చేస్తాను.

మీకు ఇప్పుడు అవకాశం ఇస్తే... ఏ విషయం గురించి మాట్లాడతారు?

నేను ఇంతకుముందే చెప్పాను.. చాలా పెద్ద పెద్ద సమస్యలున్నాయి. వీటన్నింటి గురించి సవివరంగా మాట్లాడుకోవాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే సమస్యలు బయటకు వస్తున్నాయి. వీటితోపాటు హక్కులకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటి మధ్య సమాజం కోసం ఆలోచించాలి.

ముంబయిలో చాలాకాలం నుంచి నివసిస్తున్నారు కదా... ఒక వేళ అవకాశం వస్తే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

దీని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. అలాంటి వార్త ఏదైనా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం.

ABOUT THE AUTHOR

...view details