స్పైస్ జెట్ విమానాలు రెండింటికి గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు సంస్థ అధికారులు తెలిపారు. వీటిలో ఒక విమానం ముంబయిలో, మరొకటి నాగ్‌పుర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించారు.
పూర్తి వివరాల్లోకెళ్తే..
స్పైస్ జెట్‌కు చెందిన బోయింగ్ విమానం ఎస్జీ-611 ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన 16 నిమిషాలకు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలట్లు. వెంటనే అప్రమత్తమై ముంబయి విమానాశ్రయ సిబ్బందితో మాట్లాడి అత్యవసరంగా ల్యాండ్ చేశారు.