జమ్ము కశ్మీర్ కిష్త్వార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులపై ఆదివారం రాత్రి కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ జరిగింది
జమ్ము కశ్మీర్ కిష్త్వార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులపై ఆదివారం రాత్రి కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ జరిగింది
ఆదివారం రాత్రి సెమినా కాలనీలోని ఫిల్ట్రేషన్ ప్లాంట్ వద్ద ప్రత్యేక పోలీసు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో వారిపై కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం వినబడిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలతో పడివున్న వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఇది ఉగ్రవాదుల దాడి కాదని నిర్ధరించారు. కాల్పులకు సంబంధించిన వాస్తవాలను గురించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : ముంబయి: 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం