తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ - భారత్​కు సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ

భారత్​కు అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ సమకూరనుంది. ఈ మేరకు ఈ వ్యవస్థను అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ఆమోదముద్ర వేసింది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగానే ఈ రక్షణ వ్యవస్థను భారత్​కు అందించేందుకు అమెరికా అంగీకరించిందని తెలుస్తోంది.

air defence
భారత్​కు సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ

By

Published : Feb 11, 2020, 5:30 AM IST

Updated : Feb 29, 2020, 10:37 PM IST

భారత్​కు సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ

భారత్​కు అత్యంత అధునాతన గగనతల రక్షణవ్యవస్థను అమెరికా సరఫరా చేయనుంది. ఈ మేరకు 186 కోట్ల డాలర్ల విలువైన సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్) విక్రయానికి అగ్రరాజ్యం ఆమోదం తెలిపింది.

ఆకాశమార్గంలో జరిగే శత్రుదాడిని తిప్పికొట్టడానికి, సైనిక దళాల ఆధునీకీకరణలో భారత్​కు ఇది ఉపయోగపడుతుందని డొనాల్డ్ ట్రంప్ సర్కారు.. అమెరికా కాంగ్రెస్​కు తెలిపింది. ఐఏడీడబ్ల్యూఎస్​ను విక్రయించాలని భారత్​ కోరినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఏఎన్/ఎంపీక్యూ-64ఎఫ్​ఐ సెంటినెల్ రాడార్ వ్యవస్థ, 118 ఆమ్రామ్ ఏఐఎం-120సి-7/సి-8 క్షిపణులు, మూడు ఆమ్రామ్ మార్గనిర్దేశ వ్యవస్థలు, 134 స్టింగర్ క్షిపణులు, ఇతర అధునాతన సెన్సర్లు, సాధనాలు, లాంచర్లు మన దేశానికి అందుతాయి.

వ్యూహాత్మకంగా..

భారత్​కు క్షిపణి రక్షణ వ్యవస్థ అమ్మకంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మకంగా మరింత బలోపేతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేసింది అగ్రరాజ్యం.

ఇదీ చూడండి: కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డ తొలి బాధితురాలు

Last Updated : Feb 29, 2020, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details