తెలంగాణ

telangana

ETV Bharat / bharat

థియేటర్లలో 100% సీటింగ్​పై తమిళనాడు యూటర్న్

థియేటర్లలో 100శాతం సీటింగ్​కు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కొవిడ్​ నిబంధలను తప్పనిసారిగా పాటించాలని కేంద్రం చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

By

Published : Jan 8, 2021, 7:32 PM IST

TN govt  withdraws order allowing 100% capacity in cinema halls
'థియేటర్లలో 100 శాతం సీటింగ్'​ ఉత్తర్వులు వెనక్కి

తమిళనాట థియేటర్లలో 100 శాతం సీటింగ్​తో ప్రేక్షకులను అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను పళనిస్వామి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనే థియేటర్లు పనిచేయాలని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర హొమంత్రిత్వ శాఖ సూచించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇదీ జరిగింది..

తమిళనాడులో థియేటర్లు, మల్టీపెక్స్​లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. ఇలా చేయడం కేంద్రం మార్గదర్శకాలకు విరుద్ధమని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. తక్షణమే ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని సూచించింది. కరోనా నేపథ్యంలో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ.. విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ చేసిన మార్గదర్శకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. హోమంత్రిత్వ శాఖ 2020, డిసెంబర్ 28న జారీ చేసిన కరోనా మార్గదర్శకాలు తమిళనాడులోనూ అమలు చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పింది.

ఇదీ చూడండి: 'ఆధార్'​లా రైతులకు 'స్వాభిమాని ఫార్మర్'​ కార్డ్

ABOUT THE AUTHOR

...view details