తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి కార్డుతో పర్యావరణ పరిరక్షణ సందేశం - eco friendly

ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నంద్​గావ్​లో జరగనున్న ఓ వివాహం సర్వత్రా చర్చనీయాంశమైంది.  కుమారుడి పెళ్లి కార్డుతో పాటు ఓ విత్తనాల పాకెట్​ను జతచేసి బంధుమిత్రులకు అందిస్తున్నారు. ఓజోన్ పొరను రక్షించేందుకు తమ వంతు కృషి చేయాలని చాటుతున్నారు.

పెళ్లి కార్డుతో పర్యావరణ పరిరక్షణ సందేశం

By

Published : Jun 24, 2019, 9:24 PM IST

పెళ్లి కార్డుతో పర్యావరణ పరిరక్షణ సందేశం

తరాలనాటి కథంతా మన తదుపరి మిగలాలంట... కదపక చెరపక పదికాలాలిది కాపాడాలంట... ఓ తెలుగు సినిమా పాటలోని పంక్తి ఇది. దీన్ని అక్షరాలా నిరూపిస్తోంది ఛత్తీస్​గఢ్​లోని ఓ కుటుంబం. తమ ఇంట్లోని పెళ్లి ద్వారా పర్యావరణానికి హాని చెయ్యొద్దనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు.

రంగురంగులతో ముద్రించి పదికాలాల పాటు పదిలంగా దాచుకోవాల్సిన శుభలేఖను చేతితో రాసి బంధువులకు పంచారు. అంతే కాదండోయ్... ఆహ్వాన పత్రికతో పాటు ఓ విత్తనాల పొట్లాన్ని జత చేశారు. ఈ పొట్లంలో పళ్లు, నీడనిచ్చే మొక్కల విత్తనాలను ఉంచారు. ఒక్కో పొట్లంలో ఆరు విత్తనాల చొప్పున పంపిణీ చేశారు.

"ఈ వివాహంలో నేనొక ప్రయోగం చేశాను. ఆహ్వాన పత్రికతో పాటు విత్తనాల ప్యాకెట్​ను అందించాను. వచ్చే వర్షాకాలంలో ప్రతీ కుటుంబం ఒక మొక్కనైనా పెంచాలనేదని మా లక్ష్యం. దీని వల్ల ఓజోన్ పొరను రక్షించడంలో ఎంతో కొంత ఉపకరిస్తుంది. పర్యావరణ పరిరక్షణ జిల్లా కో ఆర్డినేటర్​ అయిన నా సతీమణి శోభాంజలి శ్రీవాత్సవ ఈ ఆలోచన ఇచ్చారు. మా కుటుంబమంతా పర్యావరణ హితమైన కార్డులను చేతితో రాసి తయారుచేసి అందించాం."

-ఆమోద్ శ్రీవాత్సవ, పెళ్లి కుమారుడి తండ్రి

350 పర్యావరణ హిత కార్డులను పంచామన్న ఆమోద్, పెళ్లి కార్డు తమకు అవసరం లేదని విత్తనాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ పలువురు ఫోన్లు చేశారని తెలిపారు. ప్రతి వ్యక్తి జీవితకాలంలో కనీసం అయిదు మొక్కలైనా నాటాలని ఆకాంక్షించారు. జూన్ 25నే ఈ పర్యావరణ హిత వివాహ వేడుక.

ఇదీ చూడండి: విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.34 లక్షల కోట్లు?

ABOUT THE AUTHOR

...view details