ఇటీవల వెలుగు చూస్తోన్న అటవీ ఏనుగుల మృతి ఘటనలపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లో రెండు అటవీ ఏనుగుల మృతికి కారణాలు తెలుసుకొని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది కేంద్ర పర్యావరణ శాఖ. కేసులోని పూర్తి వివరాలను వెంటనే అందించాలని కోరింది.
రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పుర్ జిల్లాలో రెండు అటవీ ఏనుగులు మృతి చెందాయి. అందులో ఒకటి గర్భంతో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టాలని కోరింది కేంద్రం.