తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుదుచ్చేరి సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు

పుదుచ్చేరి సీఎం, లెఫ్టినెంట్​ గవర్నర్(ఎల్​జీ)​ మధ్య అధికార పోరాటం సుప్రీంకోర్టుకెక్కింది. మద్రాసు హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎల్​జీ కిరణ్​ బేడీ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం నేడు విచారించింది. వ్యాజ్యంపై స్పందించాలని  సీఎం నారాయణ స్వామికి నోటీసులు జారీ చేసింది.

పుదుచ్చేరి సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు

By

Published : Jun 4, 2019, 3:05 PM IST

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్​ కిరణ్​ బేడీ, కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​ విచారణలో భాగంగా వివరణ ఇవ్వాలని సూచించింది.

ప్రభుత్వం నిర్వహించే రోజువారీ కార్యకలాపాల్లో లెఫ్టినెంట్ గవర్నర్​ కిరణ్ బేడీ జోక్యం చేసుకోకూడదని మద్రాసు హైకోర్టు ఏప్రిల్​ 30న తీర్పునిచ్చింది. దిల్లీ తరహా నిబంధనలు పుదుచ్చేరికి వర్తించవని చెప్పింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని కేంద్ర ప్రభుత్వం సహా లెఫ్టినెంట్​ గవర్నర్​ కిరణ్​ బేడీ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

21 వరకు ఆర్థిక నిర్ణయాలకు బ్రేక్​

ఈ పిటిషన్​ను జస్టిస్​ ఇందూ మల్హోత్రా, ఎంఆర్​ షాలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారించింది. కేసు విచారణ ముగిసే వరకు ఆర్థికపరమైన కేబినెట్ నిర్ణయాలు అమలు చేయకూడదని పుదుచ్చేరి సీఎం వి. నారాయణ స్వామి, ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. వ్యాజ్యంపై స్పందించాలంటూ నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి: కన్నడనాట మలుపులు... జేడీఎస్ అధ్యక్షుడి రాజీనామా

ABOUT THE AUTHOR

...view details